10
రాగం - కాంభోజి తాళం - ఆది- ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||
- మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||
- దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత||
- ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత తంబు ప్రీతిఁ జేసెదన్ ||ఎంత||
0 కామెంట్‌లు