Deva neeku sthothramu e rathrilo ni velugu dheevenakai దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై

Song no: #50
    దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||

  1. పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||
  2. చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||
  3. నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ||

Post a Comment

أحدث أقدم