యేసు మంచి కాపరి - నన్నెత్తుకొని మోయును
నా బాధలన్నీ తీర్చును - నన్నాదరించును -II
పలు మారులు త్రోవ తప్పి - తిరుగాడి అలసిపోతిని -II
క్షమియించి నన్ను దారికి తెచ్చి - బండపై నన్ను స్థిర పరచెను -II
ఆనందింతు అన్నివేళలా - సందియము లేక ఈ యాత్రలో -II
కృప నుండి కృపను పొందుచు నేను - వెనుకంజ వేయక సాగేదను -II
విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను - చాటింతును నాదు జీవితమంతా -II
శ్రమయైన బాధైనా కరువైన హింసైనా - వస్త్ర హీనతయైన ఉపద్రవమైన -II
చేరెదను పరదేశును - క్రీస్తుని రూపము ధరియింపను -II
పయనింతును నిత్యత్వమంతా - విమోచన గీతముల్ పాడుచున్ - II
నా
కామెంట్‌ను పోస్ట్ చేయండి