Song no: 578 నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా|| ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా|| పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా || వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా || కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||
Song no: 123 తా – ఆది ఇశ్రాయేలీయుల దేవుండే – యెంతో స్తుతి నొందును గాక = యాశ్రితువౌ తన జనులకు దర్శన – మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥ తన దాసుఁడు దావీదు గృహంబున – ఘన రక్షణ శృంగము నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు – మనలన్ బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥ దీనిని గూర్చి ప్రవక్తల నోట – దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ – మహిలోన నిబంధనఁ జేసె ॥నిశ్రా॥ జనకుం దగు నబ్రాహాముతోఁ – జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన – గని నిర్భయులమై మెలఁగ ॥నిశ్రా॥ ఆయన సన్నిధానమునందు – నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబును –…
Song no: #31 ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో|| నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ|| పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో|| కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో|| మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను…
24 రాగం - (చాయ: ) తాళం - భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ|| యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ|| యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ|| అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ|| ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ|| ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల …
Song no: 31 ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో|| నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్...
దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన|| నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన| అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||
Song no: #53 ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||మీ|| చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||యీ|| దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||మీ|| నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||యీ|| జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||
Song no: 461 ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను|| ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను|| క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను|| పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను|| నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్ల…
4 12 యెహోవా దేవుని స్తుతి రాగం - ఆనందభైరవి (103-వ దావీదు కీర్తన) తాళం - ఆది దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగములో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకుఁ జేసిన మేళ్లన్ మరవకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ వేయును నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే …
75 క్రీస్తుకు మంగళ స్తోత్రము రాగం - మారువ (చాయ : మంగళమే యేసునకు) తాళం - ఆట మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళ|| ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి ||మంగళ|| సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వార…
72 క్రీస్తునకు మంగళార్చన రాగం - బిలహరి (చాయ : గీతములు పాడరే) తాళం - త్రిపుట మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరె మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము|| రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము|| కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁద…
16 యెహోవా ప్రేమ రాగం - శంకరాభరణము తాళం - ఆది యెహోవా నా మొఱ లాలించెను దన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుఁడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవా|| పిశాచి గడిమిఁబడఁగొట్టెను దన వశాన నను నిలువఁ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమునఁజేర్చి సేదఁదీర్చెను ||యెహోవా|| మదావళముఁ బోలు నామదిన్ దన ప్రదీప్త వాక్యాం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికిఁ జేర్చెను ||యెహోవా|| అనీతి వస్త్ర …
4 దేవుని యనూనత్వములు రాగం - కేదారగౌళ తాళం - ఆది దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర ||దేవా|| సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి ||దేవా|| అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ||దేవా|| సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా స…
Song no: 117 రా – రేగుప్తి తా – ఏక యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు – వేగమె — వాసిగ నిటరండు = భాసురముగ ప్రభు జన్మము బాడుచు – నాసతోడ రండు – వేగమె — యాసతోడ రండు ||జే జయం|| దూతలమాదిరి గాత్రము లెత్తుచు – గీతము బాడుండి – వేగమె – గీతము బాడుండి = దాతయౌ మన క్రీస్తుని నీతిని – ఖ్యాతిగ బలుకుండి – వేగమె ఖ్యాతిగ బలుకుండి ||జే జయం|| గొల్లలు ప్రభు కడకేగిన రీతిని – నెల్లరు నడువుండి – వేగమె – యెల్లరు నడువుండి = ఉల్లములందున సంతసించి ప్రభు – నెల్లెడ దెలుపుండి – వేగమె – యెల్లడ దెలుపుండి ||జే జయం|| జ్ఞానుల భంగిని మానవులందరు – కానుక లియ్యుండి – వేగమె – కానుక…
Song no: #50 దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ|| పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ|| చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ|| నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ||
73 క్రీస్తునకు స్తోత్రము రాగం - తోడి తాళం - ఆది మంగళమే యేసునకు – మానుజావతారునకు (3) శృంగార ప్రభువునకు (2) క్షేమాధిపతికి మంగళమే || మంగళమే || పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3) నిరుపమానందునకు (2) నిపుణ వేద్యునకు మంగళమే || మంగళమే || దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3) కరుణా సంపన్నునకు (2) జ్ఞాన దీప్తునకు మంగళమే || మంగళమే || సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు…
315 ఉన్న విధముననే నీయొద్దకు వచ్చుచున్నాను రాగం - ముఖారి తాళం - త్రిపుట ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న|| కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| …
228 క్రైస్తవ యువజనులారా క్రీస్తు కోరకు నెలవండి రాగం - బేహాగ్ తాళం - ఆది (రాగం : ముఖరి ) (ఛాయ : హృదయమనెడు తలుపునొద్ద ) song 228 నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు నింకఁ జొత్తు మెచ్చుట || నాఁడు || 1. మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు గుండె దిగులుగా || నాఁడు || 2. దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాఁడుగా || నాఁడు || 3. ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని …
514 క్రీస్తును చూడ రండి రాగం - శంకరాభరణము తాళం - ఆది Song no: #83 రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ ట ||రారే|| పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడ…
514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 184 ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార ఆ మహాత్ముఁడు మరణ మగు రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క జనుని చందము గాదు ఈ మహిని గల పాప జీవుల పై మహాకృపఁ జూపి నిత్య క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాఁడు స్వేచ్ఛను || ఏమాశ్చర్యము || 1. కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి య…
514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 393 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే (2) మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| ఐహిక సుఖము – నరసితి నిత్యము (2) ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే|| న్యాయము గాని – నా క్రియలన్ని (2) రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే|| భావము మార్చి – నావెత దీర్చి (2) …
514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Pilli Kamalakar M. D. Shikha Mani Nithya Santhoshini Bilmoria Song no: 313 త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి|| గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి|| నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ …
514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 104 రా – యదుకులకాంభోజి తా – ఆది వినరే యో నరులారా – వీనుల కింపు విూర – మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుఁ డయ్యె – వినరే = అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును ॥వినరే॥ నరరూపుఁ బూని ఘోర – నరకుల రారమ్మని – దురితముఁ బాపు దొడ్డ — దొరయౌ మరియా వరపత్రుఁడు = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి -గి రయంబున ప్రభు – కరుణను గనరే ॥వినరే॥ ఆనందమైన మోక్ష – మందరి కియ్య దీక్ష – బ…
514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 106 రా – ఆనందభైరవి తా – త్రిపుట వచ్చిగాబ్రియేలు పల్కెను – మరియ – మచ్చకంటిడెంద ముల్కెను = హెచ్చైన శుభముల – నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని – న్నెచ్చు జేయునటంచు ॥వచ్చి॥ భయ మాత్మలో వీడు కన్యకా – నీవు – దయబొంది యున్నావు ధన్యగా = రయముగ నిదిగోగ – ర్భముఁ దాల్చెదవు పుత్రో – దయమౌ యేసను పేర – తని కిడు మంచును ॥వచ్చి॥ అతఁడెన్నఁబడును మహాత్ముడై – సర్వో – న్నతుఁడైన దైవకుమారుఁడై = హిత మ…
514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 107 రా – సురటి తా – త్రిపుట ఉదయించినాఁడు – క్రీస్తుఁడు నేఁడు – ఉదయించినాఁడు = విదితయౌ మరియ నందనుఁడై యిమ్మానుయేల్ = సదయుఁడై చెడియున్న పృథివికి – నొదవ సమ్మద మల పిశాచికి – మద మణంగను సాధు జనముల — హృదయముల ముద మెదుగునట్లుగ ॥నుదయించి॥ ఏ విభునివలన – నీ జగ మయ్యె – నా విభుఁ డీయిలను = దైవత్వమగు మను – ష్యావతారముఁ దాల్చె = జీవులకు జీవనముపై తగ – దేవుఁడును దానొక్కఁడు చిర-జీవియగు ప్రభు పాపి జీవులఁ – గావఁ ద…
514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 177 JESUS FORETELLS ABOUT HIS DEATH yyy యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన గర ప్రాంతములyను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు|| 1. యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు|| 2. నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేస…
485 క్రైస్తవ యువజనులారా క్రీస్తు కోరకు నెలవండి రాగం - బేహాగ్ తాళం - ఆది Song no: 485 సకలేంద్రియములారాచాల మీ పనిదీరె నిఁక నన్ను విడిచిపోవు టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని మీ రి క దొలంగుఁడు యేసు నా ర క్షకుఁడు వచ్చెను నన్ను గావను || సకలేంద్రియములారా || పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు ద లఁచి చూడుఁడు దేవ కృపలో నుంచి ననుఁ గదలి…
Social Plugin