ఫిబ్రవరి 25, 2019
inJacob Chamberlain
నా యేసూ ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు
Song no: #54 నా యేసూ, ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ. నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయఁగా నా యొద్ద నుండు రక్షకా. నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింపఁ జావఁజాలను. నేఁడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకిఁ జేర్చుము. రోగిని స్వస్థపఱచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖముఁ బాపి యానంద మియ్యుము.
Social Plugin