Uhinchaleni melulatho nimpina na yesayya ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా

ఊహించలేని మేలులతో నింపిన - నా యేసయ్యా నీకు నా వందనం
వర్ణించగలనా నీ కార్యములనూ - వివరింపగలనా నీ మేలులన్‌

1. మేలులతో నా హృదయం - తృప్తి పరచినావు
రక్షణ పాత్ర నిచ్చి నిన్ను స్తుతియింతును
ఇశ్రాయేలు దేవుడా...
నా రక్షకా - స్తుతియింతును నీ నామమున్‌ ||ఊహించ||

 2. నా దీన స్థితిని - నీవు మార్చినావు
నా జీవితానికి విలువ నిచ్చినావు
నీ కృపతో నన్ను ఆదరించినావు
నీ సన్నిధి నాకు తోడు నీచ్చినావు ||ఊహించ||

 3. నా ప్రాణమా నా అంతరంగమా
యెహోవా నామమును సన్నుతించుమా
యేసయ్య చేసిన ఉపకారములలో
దేనిని నీవు మరువకుమా ||ఊహించ||

Post a Comment

أحدث أقدم