Ye yogyatha leni nannu neevu preminchinavu ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా

ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును

1. కలిషుతుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు
పావన దేహంలో గాయాలు పొంది
రక్తమంత చిందించినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును

2. సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నా కియ్యుటకు
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి
నీ సొగసును కోల్పోయినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును

3. పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు
నా స్థానమందు నా శిక్ష భరించి
మరణించి తిరిగి లేచినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును

Post a Comment

أحدث أقدم