ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు
Song no: 111 ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భువించెను వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప || ఱేఁడు || 1. మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో చనకర్త యితఁ డౌను || ఱేఁడు || 2. పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు మహిమ యటంచును || ఱేఁడు || 3. కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని || ఱేఁడు…
Social Plugin