సంతోషం పొంగింది (2) సంతోషం పొంగుతున్నది –
హల్లెలూయ
యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం
పొంగుతున్నది.
1. దారి తప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని
ఆయన నన్ను రక్షించి – తనదు రక్తంలో కడిగి జీవితమును
మార్చి నిత్య జీవిమిచ్చెను. ||సంతో||
2. నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము
ఆయనీ నిన్ను క్షమియించి – తనదు రక్తంలో కడిగి
జీవితమును
మార్చి నిత్య జీవిమిచ్చెను. ||సంతో||
3. ప్రభు ప్రేమ మరచితిని – లోకమాశలందు పడిపోతివా
యేసువైపు చూడుము నీరిక్షణ పొందుము
సాతానుపై గొప్ప విజయము నిచ్చెను ||సంతో||
إرسال تعليق