సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు, నీవు ఫలిస్తే సంతోషిస్తాడు..
ఫలములనాసించిన పరలోకతండ్రి - తేరిచూచుచున్నాడు నీ వైపు - 2
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి - పరిక్షించుచున్నాడు నీ కాపు - 2
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2
1. ఐగుప్తునుండి పెరికి తెచ్చినాడు - సంఘద్రాక్షతోటలో నిన్ను నాటినాడు - 2
చుట్టు త్రవ్వి ఎరువు వేసి - నీరుపోసినాడు - 2
తన స్వాస్థ్యముగా నిను - ప్రత్యేకపరచినాడు - 2
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2
2. వెదకినపుడు నీ యొద్ద ఫలములేకయుంటే - ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా- 2
ఇవ్వబడిన సమయములో - వర్ధిల్లకుంటే - 2
మోడులాంటి నిన్ను ఇంక - నరికివేయకుండునా - 2
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2
إرسال تعليق