a61

61

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఘనుడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడి యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం బొప్పుచుండనో జనులార ||ఘనుడైన||

  1. ఒక్కడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించు సంహరించు ననియున్ నిక్కముగ దెలిసికొండీ మన సహాయమే మక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచే జేసె మృత్తుచే మానవులగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదర దిరుగదన దొడ్డిబెట్టెనో జనులారా ||ఘనుడైన||

  2. మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలో మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ సహితముగను భూమియున్ దనదు పదివేల జిహ్వల వల బొందైన నీ నగరి కా ధామంబులను గాన సన్నుతి వితతిపూరి తమ్ములుగ జేయు దేవా యో జనులారా ||ఘనుడైన||

  3. ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ తగ విరహితాద్యంతమై స్థిరమైన కాలంబువలెనె యున్న దయదయ పొరలిపోవుచు నున్నవత్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ వర శిలా ఖండ పర్వతము తోడను సాటి వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులారా ||ఘనుడైన||

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.