ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున

600

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా
    ధ్యానింప నాసక్తి జ్ఞానంబు గలిగించు } 2
    జ్ఞాన స్వరూపుడు జ్ఞానాత్మచే నీకు ||ధ్యానింపవే||

  1. అరయ నీ తలపుల నఘము లగుపడు నీకు } 2
    పరిశుద్ధు డీక్షింప బహుగా గనుపడుచుండు ||ధ్యానింపవే||

  2. పరికింప బలుకుల పాప మగుపడు నీకు } 2
    పరిశుద్ధు డరయు గ న్పడకుండు నే యది ||ధ్యానింపవే||

  3. క్రియలను జింతింప మయిల గనపడు గాన } 2
    భయ మొంది నమ్మికను బదవే క్రీస్తుని దరికి ||ధ్యానింపవే||

  4. దేవుని ఘన ప్రేమ దినదినము దలపోయ } 2
    నీవు పొందగ వచ్చు నిక్కమైన శుద్ధి ||ధ్యానింపవే||

  5. స్మరియింప నీలోన వర రక్షకుని పాట్లు } 2
    భరియింప నోపుదువె పాప మొక నిమిషంబు ||ధ్యానింపవే||

  6. హృదయంబు విమలాత్మ సదనంబు గావింప } 2
    పదవే శ్రీఘ్రంబుగ పరమ జనకుని కడకు ||ధ్యానింపవే||

  7. దేవుని సేవింప దిరముగ నాశించి } 2
    దేవాత్మ కొర కీవు దినము దేవుని వేడ ||ధ్యానింపవే||

    ✍ పులిపాక జగన్నాధము


    Dhyanimpa Ve Chiththama – Varshanthamuna – Dhyanimpa Ve Chiththama – = Dhyanincha Vasakthi – Gnanambhu Galiginchu – Gnana Swaroopudu – Gnanathmache Neeku || Dhyanimpa Ve ||

  1. Araya Nee Thalapula – Naghamu Lagupadu Neeku – Parishudhdhu Deekshimpa Bahoogaa Ganupaduchundu || Dhyanimpa Ve ||

  2. Parikimpa Balukula – Paapa Magupadu Neeku – Parishudhdha Darayu Ga- Npadakundu Ne Yadhi || Dhyanimpa Ve ||

  3. Kriyalanu Jinthimpa – Mayila Ganapadu Gaana – Bhaya Mendhi Nammikanu – Bhadhave Krishuni Dhariki || Dhyanimpa Ve ||

  4. Devuni Ghana Prema – Dhinadhinamu Dhalapoya – Neevu Pondaga Vachchu Nikkamaina Shudhdhi || Dhyanimpa Ve ||

  5. Smariyimpa Neelona – Vara Rakshakuni Paatlu – Bhariyimpa Nopudhuve – Paapa Moka Nimishambhu || Dhyanimpa Ve ||

  6. Hrudayambhu Vimalathma- Sadhanambhu Gaavimpa – Padhave Shrighrambhuga –Parama Janakuni Kadaku || Dhyanimpa Ve ||

  7. Devuni Sevimpa – Dhiramuga Nashinchi-Devathma Kora Keevu – Dhinamu Devuni Veda || Dhyanimpa Ve ||

    ✍ Pulipaka Jagannadham

Post a Comment

أحدث أقدم