నా ప్రియదేశం భారతదేశం బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం

నా ప్రియదేశం భారతదేశం
బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం
అ.ప.: I love my India - I pray for India

1. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను
భారతీయుడనైనందుకు గర్విస్తాను
సంతోష సౌభాగ్యం - సమృద్ధి సంక్షేమం
దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను || I love my ||

2. క్రైస్తవ్యం మతము కాదని మారుమనసని
జీవమునకు నడిపించునని వివరిస్తాను
మతి మార్చువాడు యేసని - మతబోధకుండు కాడని
రక్షించేదేవుడని ప్రకటిస్తాను || I love my ||

3. మనుష్యులంతా ఒక్కటేననే మంచి భావన
అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను
కేవలము మాటలు కాక - క్రియలందు మేలుచేయుచు
యేసయ్య అడుగులలో పయనిస్తాను
|| I love my ||

కామెంట్‌లు లేవు:

ads
Blogger ఆధారితం.