ఓ సంఘమా సర్వాంగమా

642

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగ నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమారాణి ఓ ఫేర అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వెణావాద్యతరంగాలలో ప్రాణేస్వరుని ప్రసన్నతతో ఆనంద తైలాసుగంధాభిషేకము నొందితివే సువాసనుండా ||ఓ||

  1. స్వస్థపరచే నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమ యుక్తంబుగా నిలువగోరె యేసువా సహించుతావా తీర్పునాడూ ||ఓ||

  2. చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా ||ఓ||

  3. వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్ఠల డాంబికులు అబద్ధజనకుని యాసనము యెజిబెలు నీ మధ్య నివసించెనా కృపావరములు ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా ||ఓ||

  4. చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీ కది మేలగును నులివెచ్చని స్థితి నీకుంటే బయటకు ఉమ్మబడెదవేమో నీ మనస్సు మార్చుకో తొల్లిప్రేమ కూర్చుకో ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ||

  5. కడపటి బూర మ్రోగగానే కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘసీనుడవై నడియాకాశము పోగలవా గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా రారాజు నెదుర్కొనగలవా ||ఓ||

Post a Comment

أحدث أقدم