≡
రాగం - కాంభోజి తాళం - ఆదిమన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||
నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||
దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం పెక్కి వర్తించె నహహ ||యన్న||
ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||
మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||
కామెంట్‌ను పోస్ట్ చేయండి