దేవ కుమారా దీనోపకారా

రాగం - కాంభోజి తాళం - ఆది

    దేవ కుమారా దీనోపకారా నా వంక దయజూప నా యన్న రారా ||దేవ||

  1. వృక్షము బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా ||దేవ||

  2. పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు ||దేవ||

  3. వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుబ్రోవవే యేసు నామావతారా ||దేవ||

  4. భజనజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముజేయవే నజరేతు వాడా ||దేవ||

  5. కనికర మత్యంత కరుణయుగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు ||దేవ||

  6. మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా ||దేవ|| దేవ కుమారా దీనోపకారా

Post a Comment

కొత్తది పాతది