దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు

613

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి క్షేమంపు టీవులను దయచేసి జీవ పోషణవార్త భావమున సమకూర్చి ||దీవెనతో||

  1. లోకమున నిన్ను వేడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరం బగు దివ్య లోకంబులో జేరి యేకముగ స్తోత్రములు నీకు జెల్లింపగ ||దీవెనతో||

  2. స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుడని నిన్ను స్తుతియించు ||దీవెనతో||

Post a Comment

కొత్తది పాతది