నడిపించు నానావ నడిసంద్రమున

661

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    నడిపించు నానావ నడిసంద్రమున దేవా నవజీవన మార్గమున నాజన్మ తరియింప ||నడిపించు||

  1. నా జీవిత తీరమున నా యపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించు లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము ||నడిపించు||

  2. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||

  3. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశయే ఆవేద నెదురాయే ఆథ్యాత్మిక లేమిగని అల్లాడె నావలలు ||నడిపించు||

  4. ప్రభు మార్గమి విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీమాట ||నడిపించు||

  5. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబును సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని యర్పణగా లోకేశజేయుమయ ||నడిపించు||

  6. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని! ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్

Post a Comment

కొత్తది పాతది