≡
రాగం - కాంభోజి తాళం - ఆదినిరతము దూతానీక మూడిగము నెరపుచుండ దండ్రి పజ్జనుండియు నిరుపమాన సౌఖ్యముల దేలు నిను బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||
కోరి నిన్ను గడుపార గనియు గను లార చూచుకొన నేరనట్టి యల మేరి గర్భమున దూయబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||
మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా ||రయ్యో||
కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ ||మయ్యో||
ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైని బెట్టి నీ కండ్ల కొక్క గంత గడ గండు పెట్ట గారణము నిజముగా ||నయ్యో||
ఈపు ప్రాణమును నీవిగ నొసగ నీటెతోడ బ్రక్కను బొడుచుట హా భావమందు దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||మయ్యో||
కామెంట్‌ను పోస్ట్ చేయండి