దేవుడు మనకు ఎల్లప్పుడు

657

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు(3)ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకుతోడ నేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||

  1. దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు ||తోడుగ||

  2. యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు ||తోడుగ||

  3. ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు ||తోడుగ||

  4. దావీదు సింహాము నెదరించి ధైర్యాన చీల్చిన యపుడు గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడి నపుడు ||తోడుగ||

  5. సింహపుబోనులో దానియేలు షద్రకు మేషాకబెద్నెగో అగ్ని గుండములో వేయబడున్ నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||

  6. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలోనున్నప్పుడు అపోస్తలుల విశ్వాసులు హింసింపబడిన యపుడు ||తోడుగ||

Post a Comment

కొత్తది పాతది