హోమ్Purushotthamu.C 89 byOnline Lyrics List —నవంబర్ 08, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వందనమయ్యా యేసు నీకు వందనమయ్యా మా కోరిక లందియ్య వయ్యా వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి వినతులు గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము పొందుపడఁ జేయవె యెహోవా నందనా పాపేంధనాగ్ని ||వందనమయ్యా||నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము విరివిగా పరుగెత్తఁ జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ ||వందనమయ్యా||నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబుఁ బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుఁబడయును ||వందనమయ్యా||శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా|| ✍ పురుషోత్తము చౌధరి Vandhanamayyaa – Yesu Neeku – Vandhanamayyaa – Maa Koarika – Landhiyya Vayyaa = Vandhanamayyaa Nee Sundhara Paadhaara – Vindhamulaku Bhakthi – Vinathulu Gaavinthu = Sandhiyambulu Leni Paramaanandhamuna Nee Yandhu Dendhamu – Pondhu Pada Cheyave Yohoavaa – Nandhanaa Paapendha Naagni || Vandhanamayyaa || Nara Dhaivathvamulu – Rendu Guudi – Pari Puurnamaina – Dha Ehaathmalu Dhariyinchi Yandhu – Lesambayina– Dhurithambu Leni – Avathaaramu – Neravugaa Dhaalchi = Dharaniki Nethen Chi Nirayaarhulagu Sarva – Narula Rakshimpa Nee Karunaa Pravaahamu = Virivigaa Parugeththa Jeyuchu – Vimalamagu Nee Praana Rakthamu – Larudhugaa Samarpanamu Chesiyu – Thirigi Lechithivoa Mahaa Prabhuu || Vandhanamayyaa || Nee Punyamandhu - Nammu Konedi – Ye Paapi Yaina – Thakshanamuna – Saapambu Baasi – Thraana Kaligi - Nee Sajjanundu – Krupa Vaanini Kaapaaduchundu = Dheevinchu Bhava Dheeya Dhivya Vaagdhthvambu – Laapathparamparala Kaddu Paduchu Nundi = Nee Vayindhana Bhaaramellanu – Moapi Yoapika Nunda Nerchina – Paapi Punyundaguchu Naathmanu – Bhavya Sukha Makhilambu Badayunu || Vandhanamayyaa || Samadhama Prema – Krupaa Vinaya - Sadhgunamu Lanedi – Bhuushanamula - Nimidi Yunnatti – Thanuvu Dhaalchi – Kramamugaa Nandhu – Dhaivathvamu - Kanu Parachi Naavu = Vimaloapa Dhesamul Vividhambugaa Sishya - Samudhayamunaku Nuththamugaa Bhoadhinchi - Amitha Paapa Haranambunaku Bhuvi Navatharinchina Menu Siluvanu - Sramanu Mruthi Kalpinchi Mruthyuvun Champi Jeevinchina Mahaathmaa || Vandhanamayyaa || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి