హోమ్Purushotthamu.C 106 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు జేయునటంచు ||వచ్చి||భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర తని కిడు మంచును ||వచ్చి||అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని కిచ్చునంచు ||వచ్చి||ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ దె ల్పెను దూత మరియతో ||వచ్చి|| ✍ పురుషోత్తము చౌధరి Vacchi Gaabriyelu Palkenu – Mariya – Maccha Kanti Dendha Mu Ulkenu = Hechchaina Subhamulan – Eanaleni Krupa Dhevu Dichchi Yinthulaloa Ni – Nnechchu Cheyu Natanchu || Vacchi || Bhayamaathmaloa Veedu Kanyakaa – Neevu – Dhaya Pondhi Yunnaavu Dhanyagaa = Rayamuga Nidhigoa Ga –Rbhamu Dhaalchedhavu Puthroa – Dhayamou Yesani Perathani Kidu Manchunu || Vacchi || Athadenna Badunu Mahaathmudai - Sarvoa – Nnathudaina Dhaiva Kumaarudai = Hitha Moppu Dhevundu - Nnathi Jesi Dhaaveedhu – Vithatha Simhaasana – Mathani Kichchu Nanchu || Vacchi || Ghanatharudagu Vaani Raajyamu – Antha – Monaguuda Dhadh Nithya Puujyamu – Vanitha Magu Yaaloabu – Vamsa Mellappu Delu – Konu Naatha Danunchu The-Lpenu Dhuutha Mariyathoa || Vacchi || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి