Yesayya puttadanta santhosammi thecchenanta యేసయ్య పుట్టాడంట సంతోషాన్ని తెచ్చెనంట

Song no:
HD
    యేసయ్య పుట్టాడంట
    సంతోషాన్ని తెచ్చెనంట
    లోక రక్షణకై వచ్చేనంట
    పాప సంకెళ్లను తెంచేనంట } 2
    ఆకాశాన చుక్కలన్నీ సందడి చేసేనంట
    భూలోకన రక్షకుని జన్మతో
    ఈ నేలంతా మురిసేనంట || యేసయ్య పుట్టాడంట ||

  1. రాజుల రాజై దివి నుండి దిగినాడంట
    పది వేలలో అతి సుందరుడై
    మనకై జన్మించడంట } 2
    మానవులను రక్షించుటకు
    గొర్రెపిల్లగా వచ్చేనంట
    మనుష్య కుమారునిగా వచ్చి
    సిలువలో వ్రేలాడేనంట } 2 || యేసయ్య పుట్టాడంట ||

  2. జ్ఞానులు గొల్లలు వెలుగును చూసారంట
    ప్రేమతో ప్రియ యేసుని
    చెంతకు చేరేనంట } 2
    బంగారమును సాంబ్రాణి
    బోళములను తెచ్చేనంట
    కానుకలను సమర్పించి పూజించి సాగేనంట || యేసయ్య పుట్టాడంట ||  } 2

أحدث أقدم