Nithyam nilichedhi nee preme yesayya నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య

Song no:

    నిత్యం నిలిచేది - నీ ప్రేమే యేసయ్య
    నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్య (2)
    నాతో ఉండేది - నీ స్నేహం యేసయా
    నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2) "నిత్యం"

  1. మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
    విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
    నీకెవరూ సాటే రారయ్యా
    నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. (2) "నిత్యం"

  2. ఈ లోక స్నేహాలన్నీ - మోసమేకదా
    అలరించే అందాలన్నీ - వ్యర్థమే కదా (2)
    నిజమైన స్నేహం నీదయ్యా
    నీ స్నేహం లేకుంటే నా బ్రతుకె వ్యర్ధమయ్యా (2) "నిత్యం"

أحدث أقدم