Papamerugani prabhuni badhapettiri పాపమెరుగనట్టి ప్రభుని బాధపెట్టిరి

Song no: 31

    పాపమెరుగనట్టి ప్రభుని - బాధపెట్టిరి = శాప వాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి

  1. దరికి వచ్చువారిజూచి - దాగడాయెను = వెరువకుండవెళ్ళి తన్ను - వెల్లడించెను || పాప ||

  2. నిరపరాధియైన తండ్రిని - నిలువబెట్టిరి = దొరతనము వారియెదుట పరిహసించిరి || పాప ||

  3. తిట్టినను మరల వారిని - తిట్టడాయెను = కొట్టినను మరల వారిని కొట్టడాయెను || పాప ||

  4. తన్ను జంపు జనుల యెడల - దయనుజూపెను = చెన్నుగ - దొంగను రక్షింప - చేయిచాపెను || పాప ||

  5. కాలువలుగా రక్తమెల్ల - గారుచుండెను = పాలకుండౌ యేసు జాలి - బారుచుండెను || పాప ||





raagaM: biLhari taaLaM: tiSragati



    paapameruganaTTi prabhuni - baadhapeTTiri = Saapa vaakyamulanu balki Sramalu beTTiri

  1. dariki vachchuvaarijoochi - daagaDaayenu = veruvakuMDaveLLi tannu - vellaDiMchenu || paapa ||

  2. niraparaadhiyaina taMDrini - niluvabeTTiri = doratanamu vaariyeduTa parihasiMchiri || paapa ||

  3. tiTTinanu marala vaarini - tiTTaDaayenu = koTTinanu marala vaarini koTTaDaayenu || paapa ||

  4. tannu jaMpu janula yeDala - dayanujoopenu = chennuga - doMganu rakshiMpa - chaeyichaapenu || paapa ||

  5. kaaluvalugaa raktamella - gaaruchuMDenu = paalakuMDau yaesu jaali - baaruchuMDenu || paapa ||

أحدث أقدم