Prematho nee patanu padukovalani charanamai ప్రేమతో నీ పాటను పాడుకోవాలని చరణమై నీపాటలో

Song no:

ప్రేమతో  నీ పాటను పాడుకోవాలని
 చరణమై నీపాటలో నిలిచిపోవాలని
 కుమారునిగా నా తండ్రి నీలో సాగిపోవాలని
 ఆశ నా ఆశ  " ప్రేమతో  నీ పాటను"

1.నీవే ప్రేమై నిలిచినదేవా  నన్నాదరించావు నిండుగా
నాక్షేమమే నీవు కోరగా  ఆనందమే జీవితం ఆనందమే నా జీవితం"2"
ఎంతో పరిశుద్ధము దేవా నీ నామము
ఆశ్రయించి,నిన్నాశ్రయించి గానమే చేసెదా  " ప్రేమతో  నీపాటను "

2. నీవే ఘనత నీవే మహిమ నీవేకదా నాకు సన్నిధి
నీ ప్రేమ నాలోన ఉన్నది నీ కోసమే నా హృది
దేవా నీకోసమే నా హృది "2"
నీవే నా సర్వము నీవే నా విజయము
ప్రేమలోనే నీ ప్రేమలోనే ఉంది సంతోషము " ప్రేమతో  నీ పాటను

Post a Comment

أحدث أقدم