Song no: #29
- పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో||
- నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో||
- నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||
- దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో||
- పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభో||
- ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో||
- కెరూబులను దూతలు సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో||
- నీ దపొస్తలుల మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో||
- నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో||
- ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో||
- నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్||
- ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో||
إرسال تعليق