Maa yesu kreesthu neeve mahimagala rajuvu nivu neene మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే

Song no: #30


    మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||

  1. భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||

  2. విజయము మరణపు వేదనపై నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||

  3. నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||

  4. నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||

  5. దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||

  6. నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||

  7. నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|

  8. దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ||

  9. నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||

  10. ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||

  11. నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||

Post a Comment

أحدث أقدم