యేసూ ఎలా వివరింతును నాపై నీకున్న ప్రేమ

    యేసూ ఎలా వివరింతును....నాపై నీకున్న ప్రేమ
    కను పాపను కాపాడే కను రెప్పకున్న ప్రేమ
    దోసెడు నీళ్ళైన దాయని కురుయు మబ్బుకున్న ప్రేమ
    సరితూగునా ఈ ఇలలో ఏ ప్రేమ అయినా (2)
    నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    ఆరాధనా .... ఆరాధనా .... నీ ప్రేమకే నా ఆరాధనా ....

  1. ఛళ్ళు ఛళ్ళు మని కొరడా దెబ్బలు గాయపరుచుచున్నా
    దున్నుతున్న వీపు రక్తము చిందించి … ఏరులై పారుతున్నా
    శిరస్సున ముళ్ళ కిరీటం ఈటెలై పొడుచుకుపోతున్నా (2)
    అణువైన తగ్గలేదు ప్రభూ ----- నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    -- ఆరాధనా --

  2. మోయలేని సిలువ భారము మోసినా ... ఉమ్మి వేయబడినా
    సీలలే అర చేతిని చీల్చినా... ఖడ్గములై గుండెను కోసినా
    కడ సారి దప్పిక దీర్చ నీళ్ళైన కరువయినా (2)
    కాస్త అయిన తరిగిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    -- ఆరాధనా --

  3. పాపపు మార్గము ఎంచినా ... అపరాధిని అయినా
    నీ నామము వ్యర్థముగా వాడినా ... కలుషములే పలికినా
    నిన్ను యెరుగనని అబద్ధమాడినా ... నీ గుణమే శంకించినా (2)
    ఒక్క క్షణమైనా వీడిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
    -- ఆరాధనా --