హోమ్Advitheeya Prema 📀 Samipinchuma samipinchuma o priya janama సమీపించుమా సమీపించుమా ఓ ప్రియ జనమా సమీపించుమా...సమీపించుమా... ఓ ప్రియ జనమా... వెల లేని కృపను వెల కట్టక ఇచ్చిన యేసుని పాదాలకై (2) సమీపించుమా...సమీపించుమా...నిన్నే సమర్పించుమా... మెట్టు మెట్టు ఎదుగుతున్నావు... నా అన్నవాల్లనే తొక్కుతున్నావు. ఎందుకు నీకీ వంచన స్వభావము… లోకాశ పాశాన చిక్కుచున్నావా? (2) మెట్టు దిగి వచ్చిన యేసు నీకండగా…పరలోక అందలాన్నే ఎక్కించునుగా..... (2) తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో.... ప్రేమించిన వారినీ … కంటతడి పెట్టిస్తున్నావు ... ఎందుకు నీకీ పాషాణ హృదయము ... సాతాను వలలో నీవు పడుచున్నావా? (2) కన్నీరు తుడువ వచ్చిన యేసు నీతో నడవగా...నీ ప్రేమనే తన ప్రేమగా మార్చునుగా... (2) తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో.... కనులుండి అంధుడిగా …. నేత్రాశతోనే చూచుచున్నావు. ఎందుకు నీకీ వ్యామోహ తత్వము ... దురాశ మాయలో మునుగుతున్నావా? (2) దివి నుండి భువికొచ్చిన యేసుని చేరుకో...దేహాన్నే ఆలయముగా చేసుకో… (2) తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో… || Yese Nija Devudu ||