చాచిన చేతులతో
ఎదురు చూచుచుండెను
వేచిన నీ
తండ్రి కనులు నిదుర ఎరుగక యుండెను
అ.ప. : ఓచిన్నితనయా - నీకిన్నిశ్రమలేలనయా
నీ తండ్రి
ప్రేమను గనవా – నీ యింటికే తిరిగి రావా
1. పనివారు
సయితం నీతండ్రిఇంట
రుచియైున
అన్నంతినుచుండగా
కనికరము చూపేవారెవరులేక
శుచిలేనిపొట్టుకైఆశింతువా
2. నీక్షేమమునుకోరునీతండ్రినొదిలి
ఆక్షామదేశమునజీవింతువా
విస్తారఆస్తిపైఅధికారమునువిడిచి
కష్టాలబాటలోపయనింతువా
3. పరిశుద్ధతండ్రికి ప్రియసుతునివైయుండి
పందులతో నీకు
సహవాసమా
ఏర్పరచబడినయువరాజువైయుండి
పనికిమాలినవారితోస్నేహమా