Puttenamma puttenamma yesu puttenu పుట్టెనమ్మ పుట్టెనమ్మ యేసు పుట్టెను


Song no: 121
పుట్టెనమ్మ పుట్టెనమ్మ యేసు పుట్టెను
బెత్లెహేము పురములోన
ప్రభువు పుట్టెను
కన్య మరియ గర్భమందున
పశుల పాక నీడయందున
ధన్యుల మయ్యాము యేసయ్యలో
అన్యులమైన మన మందరము
పాపులను రక్షించుటకు
ప్రభు యేసు జన్మించెను
దీనులను కరుణించుటకు
దీనుడై ఉదయించెను
ప్రేమను పంచె ప్రేమామయుడు
కృపను చూపె కరుణామయుడు
చీకటి లో వున్న మనకు
వెలుగును ఇవ్వడానికి
మరణములో వున్న మనకు
జీవమును ఇవ్వడానికి
ప్రాణం పెట్టిన ప్రేమామయుడు
పరమును ఇచ్చే పరిశుద్ధుడు


أحدث أقدم