Pardhana korakai prakshalana Lyrics

Hema chandra
Song no: 7
ప్రార్ధన కొరకై ప్రక్షాళన
ప్రార్థన అవసరాలకేనా 2
నీ విజ్ఞాపనా వినుటకై ఆయనా
చెవి యొగ్గెను ప్రతిసమయానా
దేవుని ఆ తపనా యోచించు నాయనా
మీ తండ్రి కోరినా ఎడతెగని ప్రార్థన
అవసరాలకేనా ||ప్రార్ధనా||

భూమి మీద తలిదండ్రులు
చెడ్డవారైనా కాని
తాము కన్న తమ పిల్లలకు
మంచి ఈవులియ్యాలని 2
చేపనడితే పామునివ్వరు
రొట్టెనడిగితే రాతినివ్వరు
అడగకుండానే అన్నిఇస్తారు
అవసరాలన్ని తీరుస్తారు
ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా
ఈలోకపు తండ్రితో
ఆయన కూడా సమానుడేనా 2
అడగమన్నాడు కదా అని
అన్ని అడగడమేనా
ఆత్మసంబంధమైనవడగాలని
అర్ధంకదా నాయనా ||ప్రార్ధనా||

రేపేవిధంగ బ్రతకాలని లోకమనుకున్నగాని పైనున్నవాటినే వెదకాలని
క్రైస్తవుడనుకోవాలని 2
దేవుడిచ్చిన పనిని చేయాలి
పనులకోసమే ప్రార్థించాలి
పని ఫలితాన్ని సమర్పించాలి
పరలోకానికి తిరిగి చేరాలి
యేసులాగె ప్రతిరోజు పనిచేయాలీ
ఆ యేసులాగె పని చేస్తూ ప్రార్థించాలి 2
జ్ఞానము కంటే గొప్పదైనా
దేవుని సమాధాన్నానే
నీ హృదయానికి రక్షణ కోటగా

ఉంచుతుంది ఆ ప్రార్థనా ||ప్రార్ధనా||
أحدث أقدم