కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా ( 2) దేవుని ముందు నిలిచే రోజుంది తక్కెడ తూకం వేసే రోజుంది ( 2) జీవ గ్రంథం తెరిచే రోజుంది నీ జీవిత లెక్క చెప్పే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా ( 2) || కాలం || ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా ( 2) గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు ( 2) || ఆగవేమయ్యా || చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు ( 2) నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు…
Social Plugin