Andhala thara arudhinche nakai ambara veedhilo అందాల తార అరుదించెనాకై అంబర వీధిలో

Song no: 697

    అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో
    అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవనిజాటుచున్
    ఆనందసంద్ర ముప్పొంగెనాలో - అమర కాంతిలో
    ఆది దేవుని చూడ ఆశింప మనసు - పయనమైతిని "అందాల"

  1. విశ్వాశయాత్ర దూరమెంతైన - విందుగదోచెను
    వింతైన శాంతి వర్షించెనాలో - విజయ పధమున
    విశ్వాలనేలేడి దేవ కుమారుని - వీక్షించు దీక్షతో
    విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ "అందాల"

  2. యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు
    ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి
    యేసయ్య తార యెప్పటివోలె - ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు - యేగితిస్వామి కడకు "అందాల"

  3. ప్రభు జన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే
    బాలుని జూడ జీవితమంత - పావనమాయెను
    ప్రభు పాద పూజ ధీవెనకాగ - ప్రసరించె పుణ్యము
    బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన "అందాల"

أحدث أقدم