పంచగాయాలలో దాచుకోవయ్యా

|| ||

పంచగాయాలలో దాచుకోవయ్యా
పాపినైన నన్ను ఆదుకోవయ్యా||2||
భయమును బాధను ఒంటరి తనమును ||2||
నానుండి తొలగించి నడుపుమయ్యా ||2||

1. మనస్సునున్న మలినమును తుడిచివేసి
నాలోని తలంపులను శుద్ధిచేసి ||2||
మంచి తనము నాలో ఏసు నింపుమయ్యా || పంచ ||

2. కనులకున్న చీకటిని కాంతి చేసి
మోహపు మైకపు చూపును శుద్ధి చేసి ||2||
నీవెలుగు నాలో నింపుమయ్యా || పంచ ||

3. ఎదలోని కుట్రను తీసివేసి
కోప ద్వేషాలను పారద్రోలి ||2||
ప్రేమను నాలో యేసు పెంచుమయ్యా || పంచ ||

4. కరముకున్న కల్మషమును కడిగివేసి
గాయపడిన హస్తముతో శుద్ధిచేసి ||2||
సేవాభావం యేసు నాలో నింపుమయ్యా || పంచ ||

5. దారి తప్పిన నన్ను వెదకి చేరదీసి
సరియైన మార్గమును నాకు చూపి ||2||
నీదు బాటలో నన్ను నడుపుమయ్యా || పంచ ||

Blogger ఆధారితం.