నమ్మదగిన దేవుడు నా యేసు
1.ద్రాక్ష తీగలు పూత పూయక పోయిన కొబ్బరి తోటలు కాపు కాయక పోయిన అరటి చెట్లు ఇక ఫలించక పోయిన.... ఆ... చేనులో పైరు పంటకు రాక పోయిన (2) కంట నీరు జారనీయడు ఆకలి మంటలు రేగనీయడు (2) ॥నమ్మ||
2. పుట్టి నింటివారు నెట్టి వేసిన - మెట్టి నింటివారు గెంటి వేసిన దుష్టశక్తులు చుట్టిముట్టి వేసిన దిక్కు లేక దారి తెలియక పోయిన (2) కంట నీరు జారనీయడు తాను జంటగ వెంట నడచును (2) నమ్మ|