కృపా కృపా శాశ్వత కృపా కృపా కృపా నా యేసుని కృపా

B
కృపా కృపా శాశ్వత కృపా కృపా కృపా నా యేసుని కృపా హల్లేలూయా కృపామయుడా స్తుతిస్తోత్రములు -ఘనదేవా..కృపా.. శాశ్వత కృపా..ఇది నా యేసుని కృపా

1) గర్భములో పడినప్పుడే నీ కన్ను నన్ను చూచే తల్లి ఒడిలో పరుండినప్పుడేనీ చేయి నన్ను తాకే॥ 2॥ ఆహా ఏమి అద్భుత ప్రేమ కృపామయుడా నిన్ను ఆరాధించెద ఏమి అద్భుతప్రేమ కృపామయుడా ఆరాధించెద॥2॥

2) పాపంలో నేనున్నప్పుడే నా గాయములు నీవు పొందితివే గతి లేక నేనున్నప్పుడే నా రోగములు నీవు సహించితివే ఏమి అద్భుత ప్రేమ ఆదరణకర్త ఆరాధించెద

3) దారి తప్పి నేనున్నప్పుడు నాకు మార్గమైతివే దారికానక నేనున్నప్పుడు నాకు గమ్యమైతివే ఏమి అద్భుత ప్రేమ నిరీక్షణకర్త ఆరాధించెద

Blogger ఆధారితం.