B
ప : యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా ॥2॥ ప్రియుడా ఆయనకు సమస్తము సాధ్యమే ॥2॥
అ.ప.: హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చ : నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిపించితివే ॥2॥ అద్దరికి చేర్చితివి మమ్ము కూడా శ్రమల సంద్రము నుండి దాటించితివే
అ.ప.: హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చ : అన్నార్తులకు ఆరణ్య యాత్రలో మన్నాను ఆహారముగా ఇచ్చితివే అద్దరికి చేర్చితివి మమ్ము కూడా జీవితయాత్రలో పోషించితివే 2
యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా