శాంతి దాయక యేసు శాంతి దాయక శాంతి దాయకా

B
|ప॥ శాంతి దాయక యేసు - శాంతి దాయక శాంతి దాయకా శాంతి దాయక యేసు ॥శాంతి॥ 1. శక్తిహీనులకు శక్తినిచ్చు - భక్తజనుల పోషకుండా ముక్తినిచ్చు మహిమ దేవ 2 భక్తపాలక యేసు - భక్తపాలక యేసు ॥శాంతి॥ 2. శరణు గోరిన వారి రక్షకా - మరణమును ఎడబాసినావా కరుణమూర్తి వరములిమ్మా నిరుపమ వరగురు యేసు-నిరుపమ వరగురు యేసు, శాంతిః 3. సర్వశక్తియు ధరణికి దాత - సర్వవ్యాపియు ప్రాణనాథా ఉర్విపాలక శ్రీ గురుదేవ సర్వజీవుల దేవ - సర్వజీవుల బ్రోవ ॥ శాంతి॥ 4. పిత్రపుత్ర శుద్ధాత్మ నీకే - స్తోత్రగీతము పాడెదము పాత్రమౌ నీ ప్రేమ నామము గాత్రము న్నుతియింప - ధాత్రిని ధరియింప॥శాంతి॥