నా పక్షమై నిలచిన యేసయ్య

    పల్లవి. నా పక్షమై నిలచిన యేసయ్య - నీ వశమై స్తుతి పాడెదను 2
    భీకర ధ్వని గల మార్గములో - సురక్షితముగా నన్ను కాచితివి 2
    సురక్షితముగా నన్ను కాచితివి

    స్తుతి పాడెదను నా యేసయ్య - స్తుతియించెదను జీవితాంతము 2

    చరణం
  1. నా స్థితి చూచి నను ప్రేమించి - చేర్చుకొంటివి నా దైవమా2
    నాకై రుధిరము కార్చితివి - పరివర్తనను నొసగితివి 2
    పరివర్తనుడా నా యేసయ్య - పాపరహితుడవు నీవేనయ్యా
    చరణం
  2. నీ సన్నిధిలో అనుదినం నను నిలిపి - ఆత్మతో నింపిన నా దైవమా 2
    ఆరని దీపమై మదిలోన వెలుగుచు - పరిపూర్ణతకై నడిపితివి 2
    పరిపూర్ణుడా నా యేసయ్యా - సంపూర్ణుడవు నీవేనయ్యా
    చరణం
  3. నిత్యము దూతలతో స్తుతి జయ ధ్వనులతో - పూజింపబడుచున్న నా దైవమా 2
    నీ రాజ్యమునకు చేర్చుటకై పరిశుద్ధులతో నిలిపితివి 2
    పరిశుద్ధుడా నా యేసయ్యా - అతి పరిశుద్ధుడవు నీవేనయ్యా

Post a Comment

కొత్తది పాతది