నా పక్షమైయున్న వాడు బలశూరుడు

    పల్లవి : నా పక్షమైయున్న వాడు బలశూరుడు వర్ణించలేని బహుసుందరుడు ( 2 )
    నాకు విరోధముగా రూపించేఏ ఆయుదము వర్థిల్లదు
    అగ్ని వంటి శోధనలే అయినా కృపలో సాగెదను ( 2 )
    తలచిన ప్రతి క్షణము నిత్యానందమే
    వేసేప్రతి అడుగు విజయానందమే( 2 ) ||నా పక్ష|| చరణం : ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను
    నాపైన నీకున్న అంతులేని ప్రేమకు
    కరుణారెక్కలతో నన్ను ఆవరించి కన్నతండ్రి
    వలె నన్ను ఆదరించెను ( 2 )
    కమ్మనైన ప్రేమను చూపిన కమనీయుడా
    కన్నులారా నిన్ను చూసి పరవసింతును ( 2 )
    ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన
    నీ జీవపు మాటలే నాకానందము ( 2 ) || నా పక్ష || చరణం : విశ్వాస భాటలో నా ప్రక్క నిలచి
    సింహపు నోట నుండి తప్పించినావు
    కదనరంగములో కదముత్రొక్కు ఖడ్గమువై
    శత్రువు గుండెల్లో సింహా స్వప్నమైయ్యావు ( 2 )
    విశ్వాస కర్తయైనా నీ ముఖము చూచుచు పయనించెదను గురి యోద్దకే ( 2 )
    నా ప్రాణము పోయినను పరుగును ఆపను
    నీ శక్తి కార్యాలను ఆస్వాదింతును ( 2 ) || నా పక్ష || చరణం : శుభప్రదమైన శోభితనగరులో
    మహారాజు యేసయ్యే నా ముఖ్య సంతోషం
    ఎవ్వరు పాడని నవగీతమును
    దూతలతో కలసి నే పాడెదను ( 2 )
    రమ్యమైన సీయోనులో రారాజుగా నీవే
    ప్రతి బాష్ప బిందువును తుడిచేదవు ( 2 )
    అపురూపమైనది నీ మహిమాలోకమే
    ఆ నిర్మలరాజ్యములో ప్రకాశింతును ( 2 ) || నా పక్ష ||

Post a Comment

కొత్తది పాతది