హోమ్ఉ ఉపవాస ప్రార్థన జయమిచ్చు ప్రార్థన ఉపవాస ప్రార్థన - జయమిచ్చు ప్రార్థన దేవుని శక్తిని - కనపరచు ప్రార్థన ఉపవాస ప్రార్థన - ఫలమిచ్చు ప్రార్ధన వేదన రోదన - తొలగించు ప్రార్థన సాధ్యం సాధ్యం - సమస్తము జయం జయం - నిశ్చయము 1. దుఃఖములో ఉన్న వారి - కన్నీరు తుడిచే ప్రార్థన కష్టములో ఉన్నవారికి - నెమ్మది ఇచ్చే ప్రార్థన నీ సన్నిధిలో ఉపవాసముతో - ప్రార్ధించెదనయ్య నా శోధనలను తప్పించి - నడిపించు యేసయ్య 2. చీకటిలో ఉన్నవారికి - వెలుగు ఇచ్చే ప్రార్థన త్రోవ తప్పిన వారికి - దారి చూపే ప్రార్థన నీ సన్నిధిలో ప్రతి దినము - ప్రార్ధించెదనయ్య నా పాపములను మన్నించి - కృప చూపు యేసయ్యా 3. రోగముతో ఉన్నవారికి - స్వస్థత ఇచ్చే ప్రార్థన భాదతో ఉన్నవారికి - బలమునిచ్చే ప్రార్థన నీ సన్నిధిలో అను క్షణము - ప్రార్ధించెదనయ్య నా దోషములను క్షమించి - బలపరచు యేసయ్యా 4. అపవాది బంధకములు - త్రెంచి వేసే ప్రార్థన అంధకార శక్తుల నుండి - విడుదల ఇచ్చే ప్రార్థన నీ సన్నిధిలో అధికారముతో - ప్రార్ధించెదనయ్య పరిశుద్ధాత్మ శక్తితో - నను నింపు యేసయ్యా Post a Comment కొత్తది పాతది
కామెంట్‌ను పోస్ట్ చేయండి