644
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
- పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి||
- దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి||
- ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరి||
- నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
- రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
- హల్లెలూయ కర్హుడా యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
- పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి||
إرسال تعليق