ఆహా..ఆ...అంత్యతీర్పు నందున

640

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండుఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... ||ఆహా||

  1. లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును ||ఆహా||

  2. మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే ||ఆహా||

  3. గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును ||ఆహా||

  4. నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి ||ఆహా||

  5. ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు ||ఆహా||

  6. దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును ఎవ్యాని పేరందుండదో వాడగ్నిలో బడును ||ఆహా||

Post a Comment

أحدث أقدم