543
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పరదేశంబున వసించి పరమాత్తుని మది దలంచి దురితమును జయించిన స చ్చరితుడైన యోసేపు ||ననుకరించెద||
తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టముల దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమున బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
పరులకు న్యాయంబు దీర్ప బ్రజలకు క్షేమంబు గూర్ప పరమ వివేకంబు గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
యజమానుని కుష్ఠు గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజ గపట మింత లేక చేసి ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
ప్రార్థన కూటమున జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగ బేతురుని సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
భక్తిభయములందు బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలది సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||
కామెంట్‌ను పోస్ట్ చేయండి