511
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి పరమ కానాన్ దేశము ||ఏదియది||
- ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల శ్రీకరుని నివాసము ||ఏదియది||
- జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు బుల స్వదేశము ||ఏదియది||
- యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా మృతములిడు దేశము ||ఏదియది||
- కోరికలు దీరునట్లు గొబ్బుననే బోదురా చేరి సౌఖ్యమొంద మదిని స్ధిరత బూని యుంటిరా ||ఏదియది||
- మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునే గాచి దాని దాటిపోవ నుంటిరా ||ఏదియది||
- కాలు ధరను నిల్వదది కండ్లుబడు దాకరా మేలుకొని యుంటిరా మేర దాట లేకరా ||ఏదియది||
కామెంట్‌ను పోస్ట్ చేయండి