ప్రభువా మమ్మునుదీవించి పంపుము

610

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి అభినందన ముల జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ ||ప్రభువా||

  1. పగతుర బ్రేమించెడు శక్తిన్ తగబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||

  2. గుడిలో వినిన నీవాక్యము మా గుండెల బదిలము జేయగను గుడిబయటను నా చారములో నడువగ దోడ్పడుమో కీర్తి యుగయుగము లకు నీ కగుతన్ ||ప్రభువా||

  3. క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయగనిమ్ము నేస్తవ భావము లోకములో నెరపగ దయగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||

Post a Comment

కొత్తది పాతది