దేవునికి స్తోత్రము గానము

658

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిదియెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని(2) ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవుని||

  1. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవుని||

  2. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటి కన్నియు పేరులు పెట్టిచున్నవాడని ||దేవుని||

  3. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవుని||

  4. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవుని||

  5. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపర్చువాడని ||దేవుని||

  6. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవుని||

  7. గుర్రముల నరులదలి బలము నానందించుడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవుని||

  8. యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవుని||

  9. పిల్లల నాశీర్వదించియు బలపరచు నీగుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచున

Post a Comment

కొత్తది పాతది