కృపామయుడా నీలోన

648

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలోఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా||

  1. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపా||

  2. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా||

  3. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపా||

Post a Comment

أحدث أقدم